Fri Dec 05 2025 21:51:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పోలవరానికి సీపీఐ నేతలు
నేడు సీపీఐ నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను సీీపీఐ నేతలు పరిశీలించారు

నేడు సీపీఐ నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను సీీపీఐ నేతలు పరిశీలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనుంది. ఈ పర్యనటలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులను బృదం పరిశీలిస్తుంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండటంతో పనులు ఎంతవరకూ వచ్చాయన్న దానిపై పరిశీలన జరరపనుంది.
ప్రాజెక్టు పూర్తికి...
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పై ఈ ప్రతినిధుల బృందం ఆరా తీయనుంది. వారికి పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? అని సీపీఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలవరం నిర్మాణ పూర్తికి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కేంద్రం నిధులు వెంటనే విడుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ పర్యటననకు పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలి.
Next Story

