Sat Dec 06 2025 04:28:15 GMT+0000 (Coordinated Universal Time)
అదే జరగకుంటే ఇబ్బంది పడేది చంద్రబాబే
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పొత్తులపై నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికలకు ముందు ఇబ్బంది పడతారని సీపీఐ నేత నారాయణ అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పొత్తులపై నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికలకు ముందు ఇబ్బంది పడతారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆయన బీజేపీతో కలవాలన్న ప్రయత్నం ఉంటే ఇప్పుడే చెబితే మంచిదని, తమ దారి తాము చూసుకుంటామని నారాయణ తెలిపారు. చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందని, అయితే బీజేపీతో పొత్తు ఉంటే తాము అంగీకరించే ప్రసక్తి లేదని నారాయణ చెప్పారు.
త్వరగా స్పష్టత ఇస్తే....
అందుకే చంద్రబాబు పొత్తులపై త్వరగా ఒక స్పష్టతకు వస్తే మంచిదని నారాయణ సూచించారు. ఏపీలో ఓటీఎస్ విధానం మంచిదేనని చెప్పారు. దీని వల్ల పేదల ఆస్తుల విలువ పెరుగుతుందని నారాయణ అన్నారు.
Next Story

