Fri Dec 05 2025 16:54:14 GMT+0000 (Coordinated Universal Time)
మూడేళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకున్న వారేరీ?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కడప జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన చేపట్టారు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కడప జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన చేపట్టారు. ఆయన నేతృత్వంలో సీీపీఐ ప్రతినిధి బృందం మూడవరోజు కడప జిల్లాలో ప్రాజెక్టుల పర్యటన చేపట్టింది. రాజోలి రిజర్వాయర్, బ్రహ్మం సాగర్, వామికొండ, సర్వరాయ సాగర్, వెలిగల్లు ప్రాజెక్టులను పరిశీలించింది.
మూడో రోజు సందర్శన...
గత మూడున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉందని ఈ సందర్భంగా రామకృష్ణ అన్నారు. అనేక ప్రాజెక్టులు మరమ్మతులకు సైతం నోచుకోలేదని, నీటిపారుదల రంగం అస్తవ్యస్తంగా ఉంటే వ్యవసాయ రంగం ఎలా మెరుగుపడుతుందని రామకృష్ణ ప్రశ్నించారు.
Next Story

