Wed Mar 18 2026 15:20:31 GMT+0530 (India Standard Time)
ఏపీలో స్థిరంగా కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి, కొత్తగా ఏపీలో 08 కొత్త కేసులు నమోదయ్యాయి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,556 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా ఏపీలో 08 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇదే సమయంలో మరో 15 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,607 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు....
వారిలో 14,730 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,761 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 165యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,34,73,222 నమూనాలను పరీక్షించారు.
Next Story

