Sat Mar 07 2026 21:57:53 GMT+0530 (India Standard Time)
ఏపీ మంత్రిపై ఎన్బిడబ్ల్యూ జారీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషాశ్రీ చరణ్ పై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషాశ్రీ చరణ్ పై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఉషశ్రీ చరణ్ పదే పదే కోర్టు ఎదుటకు హాజరు కాకపోవడంతో ఈ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఉషశ్రీ చరణ్ తో పాటు మరో ఏడుగురు కూడా విచారణకు గైర్హాజరవుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా...
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2017లో ఉషశ్రీ చరణ్ తో పాటు ఆమె అనుచరులపై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఉషశ్రీ చరణ్ ర్యాలీ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు పదే పదే కోర్టుకు గైర్హాజరు అవుతుండటంతో కల్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు.
Next Story

