Fri Dec 05 2025 08:14:37 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి పోలీస్ కస్టడీలో అరుణ
నిడిగుంట అరుణకు నేటి నుంచి మూడ్రోజులపాటు పోలీసు కస్టడీ కి న్యాయస్థానం అనుమతించింది

నిడిగుంట అరుణకు నేటి నుంచి మూడ్రోజులపాటు పోలీసు కస్టడీ కి న్యాయస్థానం అనుమతించింది. నెల్లూరుకు చెందిన అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరు పర్చడంతో ఆమెను ఒంగోలు జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు అరుణను ప్రశ్నించేందుకు పోలీసులకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
మూడ్రోజుల పాటు...
అరుణను మూడ్రోజులపాటు కోవూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు ప్రశ్నించనున్నారు. రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఘటనలో కీలకంగా పనిచేసిన అరుణ పై అనేక కేసులు నమోదయ్యాయి. పలు రాజకీయ, పోలీసు అధికారులతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్‌పై పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించి దాని అధారంగా అరుణను ప్రశ్నించనున్నారు. శ్రీకాంత్, అరుణ నేరాలపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పోలీసుు సమర్పించారు.
Next Story

