Sun Mar 15 2026 14:53:01 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను పూర్తి చేశారు

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఇటీవల ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లెక్కింపు ప్రారంభమయింది. తొలుత పోస్టల్ బ్యాలట్లను లెక్కిస్తారు. అనంతరం ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ ఒక టీచర్ ఎమ్మెల్సీ లెక్కింపు జరగనుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. ఫలితాలు వచ్చే సరికి ఆలస్యమయ్యే అవకాశముంది. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించవలసి రావడం, బ్యాలట్ పేపర్ తో లెక్కించవలసి రావడంతో ఫలితాలు అర్థరాత్రి దాటే అవకాశముందని తెలిసింది.
Next Story

