Sun Mar 15 2026 21:32:06 GMT+0530 (India Standard Time)
దాచేపల్లి, గురజాలలో టెన్షన్ ..టెన్షన్
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది.

గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ఈ రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ, వైసీపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురజాలలో మొత్తం 20 వార్డులుండగా వైసీపీ ఇప్పటికే ఆరు వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. మరో ఐదు వార్డులను కైవసం చేసుకుంటే మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కినట్లే.
19 వార్డుల్లో....
దాచేపల్లిలోనూ ఇరవై వార్డులున్నాయి. ఇక్కడ ఒక్కటే ఏకగ్రీవం అయింది. వైసీీపీకి దక్కింది. 19 వార్డుల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు జరుగుతుంది. దాచేపల్లి, గురజాలలో మున్సిపల్ ఛైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది.
Next Story

