Thu Mar 19 2026 07:22:33 GMT+0530 (India Standard Time)
Corona Virus : తిరుపతిలో కరోనా కల్లోలం.. హై అలర్ట్
తిరుపతి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు

తిరుపతి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆధ్మాత్మిక క్షేత్రం కావడం, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో కరోనా వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశముందని వైద్యులు ముందుగానే హెచ్చరిట్లుగానే కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది.
ఇరవై మందికి....
తిరుపతి జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో ఇరవై కేసులు నమోదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ మంది కరోనా వ్యాధి సోకిన వారు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో చాలా మంది కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
Next Story

