Wed Mar 18 2026 16:46:07 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే?
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఏపీలో 05 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఏపీలో 05 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,591 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,732 గా ఉంది. 180 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,34,65,980 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగం చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story

