Fri Mar 20 2026 06:34:05 GMT+0530 (India Standard Time)
ఏపీలో తగ్గుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 191 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 191 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,70,286 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,418 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,53,134 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,734 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,00,04,569 నమూనాలను పరీక్షించారు.
Next Story

