Sun Feb 01 2026 17:10:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో వందకు లోపే కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 71 కొత్త కేసులు నమోదయ్యాయి

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 71 కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు నెలల తర్వాత వంద కేసులకు దిగువన నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,17,812 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,727 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,00,760 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 2,325 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,31,05,610 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి.
Next Story

