Sun Feb 01 2026 17:10:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 141 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 141 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,17,605 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,725 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,99,362 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 3,518 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,30,81,987 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి.
Next Story

