Fri Mar 20 2026 06:08:06 GMT+0530 (India Standard Time)
ఏపీ లో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 156 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 156 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,74,708 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,465 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,58,289 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1954 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,07,46,537 నమూనాలను పరీక్షించారు
Next Story

