Thu Mar 19 2026 02:10:35 GMT+0530 (India Standard Time)
ఏపీ కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 61 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 61 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,18,478 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,729 మంది మరణించారు.
వందలోపే యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,02,862 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 887 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,31,89,416 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి.
Next Story

