Wed Mar 18 2026 23:22:11 GMT+0530 (India Standard Time)
ఏపీలో తగ్గుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,066 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
అనంతపురం టాప్...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,829 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 507 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,33,02,909 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి.
Next Story

