Thu Mar 19 2026 00:49:19 GMT+0530 (India Standard Time)
ఏపీలో కనుమరుగవుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 50 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 50 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,18,801 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,438గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 633 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,32,50,093 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.
Next Story

