Wed Mar 18 2026 21:36:08 GMT+0530 (India Standard Time)
ఏపీ కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,181 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు. పెరుగుతున్న
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,933 గా ఉంది. యాక్టివ్ కేసులు నిన్నటితో పోలిస్తే మళ్లీ పెరుగుతున్నాయి. 518 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,33,22,836 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి.
Next Story

