Sun Feb 01 2026 15:28:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 122 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,18,176 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,729 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,01,904 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 1,543 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,31,39,649 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి.
Next Story

