Thu May 02 2024 11:43:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 183 కొత్త కేసులు నమోదయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 183 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒకరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,72,014 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,431 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,55,389 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,194 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,02,86,530 నమూనాలను పరీక్షించారు.
Next Story