Wed Mar 18 2026 20:02:47 GMT+0530 (India Standard Time)
ఏపీ కరోనా అప్డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 31 కొత్త కేసులు నమోదయ్యాయి

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 31 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,328 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
అనంతపురంలోనే..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,148 గా ఉంది. 450 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,33,60,681 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగం చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

