Wed Mar 18 2026 20:03:03 GMT+0530 (India Standard Time)
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,407 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,248 గా ఉంది. 429 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,33,81,540 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగం చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

