Mon Mar 30 2026 12:58:18 GMT+0530 (India Standard Time)
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 174 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 174 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఎవరూ కరోనా కారణంగా మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,71,244 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,426 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,54,553 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,265 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,01,78,784 నమూనాలను పరీక్షించారు.
Next Story

