Mon Feb 02 2026 09:36:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. సంక్రాంతి ఎఫెక్టేనా?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,996 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,996 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా నలుగురు మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 21,17,384 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,514 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,66,762 గా ఉంది. 36,108 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,19,22,969 నమూనాలను పరీక్షించారు. సంక్రాంతి పండగ వల్లనే కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Next Story

