Thu Mar 19 2026 06:27:40 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 569 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఎవరూ మృతి చెందలేదు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 569 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఎవరూ మృతి చెందలేదు. అతి తక్కువ కేసులు నమోదవ్వడం నెల రోజుల్లో ఇదే తొలిసారి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,84,631 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,71,047 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
బాగా తగ్గిన యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,379 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,107 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.21 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
Next Story

