Thu Mar 19 2026 00:46:49 GMT+0530 (India Standard Time)
ఏపీ కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,18,617 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,729 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,130 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 758 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,32,03,004 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.
Next Story

