Thu Mar 19 2026 00:46:48 GMT+0530 (India Standard Time)
ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 69 కొత్త కేసులు నమోదయ్యాయి

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 69 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,18,547 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,729 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,001 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 817 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,32,01,596 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి.
Next Story

