Wed Mar 18 2026 18:22:07 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,475 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,378 గా ఉంది. 367 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,34,00,990 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగం చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 11కరోనా కేసులు నమోదయ్యాయి
Next Story

