Thu Jan 29 2026 18:19:53 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో కరోనా... ఆసుపత్రి నుంచి పేషంట్ మాయం
ఏపీలో కరోనా కేసులు నమోదయయ్యాయి. రెండు కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు

ఏపీలో కరోనా కేసులు నమోదయయ్యాయి. రెండు కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకటి విశాఖపట్నంలోనూ, మరొకటి చిత్తూరు జిల్లాలోనూ వెలుగు చూసింది. చిత్తూరు జల్లా శాంతిపురం మండలానికి చెందిన ఒక వ్యక్తికి మొన్న కుప్పం పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ వ్యక్తిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితులు నిన్న మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి పారిపోవడం జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం దీనిని సర్దిచెప్పుకునే ప్రయత్నించారు.
విశాఖలోనూ...
మరోవైపు విశాఖలోని రైల్వే న్యూ కాలనీకి చెందిన వ్యక్తికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. జ్వరం, జలుబు ఉండటంతో కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన 42 ఏళ్ల వ్యక్తిని అరిలోవ హెల్త్ సిటీలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అతడి రక్త నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కు ల్యాబ్ కు పంపామని వైద్యులు చెబుతున్నారు.
Next Story

