Mon Mar 16 2026 01:08:27 GMT+0530 (India Standard Time)
ఈరోజు కరోనా మరణాలు పెరిగాయ్
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది మరణించారు. మరణాల సంఖ్య ఈరోజు పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,58,543 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పాజిటివిటీ రేటు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 29,181 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,04,005 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,281 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,80,97,94,588 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.40 శాతంగా నమోదయింది.
Next Story

