Sat Dec 06 2025 07:43:09 GMT+0000 (Coordinated Universal Time)
కడపలో కరోనా.. నేటి నుంచి కఠిన ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కడప జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కడప జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. కఠిన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పోలీసు శాఖ స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పరిమితికి మించి...
అలాగే పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలకు పరిమితికి మించి జనం హాజరైతే కేసులు పెడతామంటున్నారు. ఎటువంటి సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పారు. దుకాణాలు కూడా కోవిడ్ నిబంధనలను పాటించకపోతే సీజ్ చేయాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.
Next Story

