Tue Mar 24 2026 18:06:24 GMT+0530 (India Standard Time)
ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. రోజుకు ఐదువేల కేసులు నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. రోజుకు ఐదువేల కేసులు నమోదవుతున్నాయి. అయితే విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 17వ తేదీ వరకూ ఏపీలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈరోజు సెలవులు ముగుస్తాయి. అయితే రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలను తెరవాలా? లేదా? అన్న దానిపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.
సెలవులపై....
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 30వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. సెలవులపై ఏపీ ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించాలని నిర్ణయించింది. సంక్రాంతి పండగ కావడంతో కొంత వెనక్కు తగ్గి పండగ తర్వాత నైట్ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటితో పండగ ముగియడంతో నైట్ కర్ఫ్యూను కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
Next Story

