Wed Mar 18 2026 21:36:08 GMT+0530 (India Standard Time)
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 75 కొత్త కేసులు నమోదయ్యాయి

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,141 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,875 గా ఉంది. యాక్టివ్ కేసులు నిన్నటితో పోలిస్తే మళ్లీ పెరుగుతున్నాయి. 536 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,33,14,755 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి.
Next Story

