Mon Feb 02 2026 12:06:54 GMT+0000 (Coordinated Universal Time)
రద్దీ కొనసాగుతోంది
టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
కాగా.. నిన్న(జూన్ 4) శ్రీవారిని 87,434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 39,957 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శనివారం స్వామివారికి రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. తిరుమలకు వచ్చే భక్తులకు అన్నపానీయాలకు లోటు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అందుబాటులో త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఉంచింది.
Next Story

