Fri Dec 05 2025 09:51:42 GMT+0000 (Coordinated Universal Time)
లిక్కర్ స్కామ్ కేసులో ఏఆర్ కానిస్టేబుల్ సంచలన లేఖ
ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన లేఖ రాశారు.

ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డీజీపీతో పాటు పలువురికి లేఖ రాశారు. పదేళ్లపాటు చెవిరెడ్డి దగ్గర గన్మెన్గా చేశానని, లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని అన్నారు. తన కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్టే విన్నాడని అధికారులు చెప్పారు.
తనపై దాడి చేసి...
విచారణకు యూనిఫాంలో వెళ్లినందుకు తనను తిట్టారని, చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమన్నారని మదన్ రెడ్డి అన్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనని చెప్పినందుకు తనపై పది మంది సిట్ అధికారులు దాడికి దిగారని కూడా ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు వెళ్లలేనని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు.
Next Story

