Sat Mar 28 2026 01:50:58 GMT+0530 (India Standard Time)
పవన్... బ్రోకర్ పాలిటిక్స్ మానుకో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఫైర్ అయ్యారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. పవన్ ప్రసంగం పిట్టలదొర ప్రసంగంలా ఉందన్నారు. బీజేపీ రోడ్డు మ్యాప్ ప్రకారం ముందుకు పోతానని పవన్ కల్యాణ్ చెప్పడం నవ్వు తెప్పిస్తుందన్నారు. రాష్ట్రానికి పట్టిన ఒక శనిగ్రహం బీజేపీ అని, అటువంటి బీజేపీతో పవన్ కల్యాణ్ కలసి ముందుకు నడుస్తానని చెప్పడం ఆయన బలహీనతకు నిదర్శనమని తులసి రెడ్డి అన్నారు.
విలీనం చేసేయరాదూ....
జనసేన ఆవిర్భావ సభకు దామోదర సంజీవయ్య పేరు పెట్టుకుని, అదే ప్రాంగణం నుంచి కాంగ్రెస్ హటావో అనడం, రాహుల్ గాంధీని విమర్శించడమేమిటని తులసి రెడ్డి ప్రశ్నించారు. సొంతగా రాజకీయాలు చేసే శక్తి పవన్ కల్యాణ్ కు లేదని అర్థమయిందన్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఆయన కోరారు. బ్రోకర్ రాజకీయాలు మానుకోవాలని పవన్ కల్యాణ్ కు తులసి రెడ్డి హితవు పలికారు.
Next Story

