Mon Dec 15 2025 09:21:28 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : బనకచర్ల చంద్రబాబుకి ఏటీఎం : వైఎస్ షర్మిల
బనకచర్ల ప్రాజెక్ట్ చంద్రబాబుకి ఏటీఎంలా మారుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు

బనకచర్ల ప్రాజెక్ట్ చంద్రబాబుకి ఏటీఎంలా మారుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అడ్వాన్స్ మొబైలైజేషన్ కోసమే తెరమీదకు బనకచర్ల ప్రాజెక్టు తెచ్చారంటూ వైఎస్ షర్మిల మండి పడ్డారు. పోలవరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకు బనకచర్ల అంటూ చంద్రబాబు తిరుగుతున్నారని అన్నారు. అటవీ శాఖ అనుమతులు రావని చంద్రబాబుకి తెలుసునని వైఎస్ షర్మిల అన్నారు.
మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేసి...
అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంట్ వేదికగా 80 వేల కోట్లు కేంద్రం ఇస్తున్నట్లు హామీ ఉండాలని వైఎస్ షర్మిల అన్నారు. అప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ సంగతి తేల్చాలన్నారు. ముందు జలయజ్ఞం కింద గాలేరు - నగరి, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం కోసం సీఓఏను కలిశామన్న షర్మిల నెలరోజుల్లో సమస్య పరిష్కరించకుంటే డిల్లీకి వెళ్లి కలుస్తామని తెలిపారు.
Next Story

