Thu Mar 19 2026 05:25:44 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : షర్మిల నేడు చిత్తూరులో పర్యటన
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు

కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నిన్నటి వరకూ కడప జిల్లాలో పర్యటించిన షర్మిల నేడు చిత్తూరు జిల్లాకు వచ్చారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆమె పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ఆమె తన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
మూడు నియోజకవర్గాల్లో...
ఈరోజు వైఎస్ షర్మిల ఉదయం పది గంటలకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం సత్యవేడు నియోజకవర్గంలో షర్మిల పర్యటించనున్నారు. రాత్రి ఏడు గంటలకు నగరి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగించనున్నారు.
Next Story

