Thu Mar 26 2026 13:30:45 GMT+0530 (India Standard Time)
ఏపీ న్యూ పీసీసీ చీఫ్ గా గిడుగు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును పార్టీ అధినాయకత్వం నియమించింది.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును పార్టీ అధినాయకత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న శైలజానాథ్ ను ఆ బాధ్యతల నుంచితప్పించింది. గిడుగు రుద్రరాజుతో పాటు మరికొందరికి పీసీసీలో స్థానం కల్పించింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా జంగా గౌతమ్ ను నియమించింది.
తులసిరెడ్డికి...
వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తులసిరెడ్డిని కేవలం మీడియా కమిటీ ఛైర్మన్ గా నియమించింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా జంగా గౌతమ్ తో పాటు రాకేష్ రెడ్డి, మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి.
Next Story

