Sun Dec 08 2024 00:22:59 GMT+0000 (Coordinated Universal Time)
11న కడపకు రాహుల్ గాంధీ.. షర్మిల కు మద్దతుగా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 11వ తేదీన కడపకు వస్తున్నారు. వైఎస్ షర్మిలకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 11వ తేదీన కడపకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎవరూ ఏపీలో ఎవరూ ఇంత వరకూ పర్యటించలేదు. కనీసం పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీ వైపు చూడలేదు.
ఇప్పటి వరకూ...
ఏపీలో పెద్దగా ఆశల్లేవు కాబట్టి అక్కడకు వచ్చి టైం వేస్ట్ అని భావనలో నేతలు ఎవరూ ఇక్కడ ప్రచారానికి రాలేదన్నది పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిల ప్రత్యేక ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ కడప లో పర్యటించనున్నారని తెలిసింది. వైఎస్ షర్మిలకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story