Thu Mar 19 2026 06:26:07 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : ఏపీ స్టార్ క్యాంపెయినర్ షర్మిలే.. జాతీయ నేత ఒక్కరూ
కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో షర్మిల ప్రచారాన్ని ఉధృతం చేశారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జాతీయ నేతలు ఎవరూ ఏపీకి రాలేదు. కేవలం షర్మిల ఒక్కరే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు.
నేడు ఇలా...
ఈరోజు ఉదయం పది గంటలకు తిరువూరులో జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చింతలపూడికి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి ఏడు గంటలకు షర్మిల దెందులూరులో జరిగే సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

