Fri Dec 05 2025 17:34:03 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో షర్మిల పాదయాత్ర.. జగన్ ను టార్గెట్ చేస్తూ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల యుద్ధం ప్రకటించారు. విజయవాడలో పాదయాత్ర చేపట్టారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల యుద్ధం ప్రకటించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకూ పాదయాత్ర చేపట్టార. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంపై విచారణ జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేపట్టారు. అమెరికాలో అదానీపై కేసు నమోదయినా ఎందుకు విచారణకు వెనకడగు వేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు.
లంచం తీసుకున్నా...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ఆమె నిలదీశారు. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంపై ఎందుకు విచారణ జరపడం లేదని, అదానీ, మోదీలకు భయపడుతున్నారా? అంటూ ఎద్దేవా చేవారు. అన్నిరకాల ఆధారాలున్నప్పటికీ చర్యలకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని వైఎస్ షర్మిల చంద్రబాబు సర్కార్ ను ప్రశ్నిస్తూ తన సోదరుడు జగన్ ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు.
Next Story

