Fri Dec 05 2025 12:39:14 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : పదోతరగతి ఫలితాలపై షర్మిల కామెంట్స్ విన్నారా?
పదో తరగతి పరీక్ష ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు

పదో తరగతి పరీక్ష ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ గార్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు.
పేపర్లు ఎలా దిద్దారో...
ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయిందని, విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదని, వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదని, పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత పదేళ్లుగా ఫెయిల్ అవుతున్నాయని అన్నారు.
Next Story

