Fri Jan 24 2025 07:04:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : ఉప ముఖ్యమంత్రి పై షర్మిల సెటైర్లు.. ఈయన లిక్కర్ బాటిల్ మంత్రి అటగా
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గంగాధర నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గంగాధర నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిపై ఆమె సెటైర్లు వేశారు. ఎప్పుడైనా ఆయన ఈ నియోజకవర్గానికి వచ్చారా? అంటూ ప్రశ్నించారు. ఈయన లిక్కర్ బాటిల్ మంత్రి అంటకదా? అని సెటైర్లు వేశారు. అన్ని కాంట్రాక్టర్లకు ఈయనే బినామీగానే ఉంటున్నాడని, అంబేద్కర్ వారసుడు అయితే కల్తీ మద్యాన్ని విక్రయిస్తారా? అంటూ షర్మిల ప్రశ్నించారు. కల్తీ మద్యంతో జనాలు చచ్చిపోతున్నారని, దీనికి కారణం ఈ లిక్కర్ మంత్రి కాదా? అంటూ నిలదీశారు.
మద్య నిషేధం అంటే...
మద్య నిషేధం అంటే ప్రభుత్వం మద్యం అమ్మడమా అని షర్మిల అన్నారు. నియోజక వర్గంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారని, ఒక చేత్తో ఇస్తారని, మరొక చేత్తో తీసుకుంటారని షర్మిల అన్నారు. ఏడు సార్లు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, నిత్యావసర వస్తువులు రెండింతలు పెంచారని షర్మిల అన్నారు. బటన్ నొక్కడం అంటే ఇచ్చి తీసుకోవడం అన్న మాట అంటూ తన అన్న జగన్ పాలనపై సెటైర్ వేశారు.
Next Story