Sun Jun 22 2025 12:53:13 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : సైతాన్ సజ్జల అంటూ ఫైర్ అయిన షర్మిల
మహిళల మీద సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

మహిళల మీద సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. సజ్జల మూర్ఖుడిలా మాట్లాడుతున్నారన్న షర్మిల మహిళలను పిశాచులతో పోల్చుతారా? అని ప్రశ్నించారు. మహిళలను రాక్షసులు అంటారా? సంకర జాతి అని అవమానిస్తారా ? చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి మీకు ఎందుకు నామోషీ ? అని షర్మిల నిలదీశారు. వైసీపీ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుందని, ఇదే సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తనను కూడా వదిలి పెట్టలేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
తప్పుడు ప్రచారం చేయించారని...
సైతాన్ సైన్యంతో తన మీద తప్పుడు ప్రచారం చేయించారని, వైఎస్ బిడ్డ అని, ఒక మహిళా అని చూడకుండా కించపరిచారన్నారు. జగన్ తన అక్క చెల్లెళ్ళు అంటాడని, జగన్ సొంత చెల్లికి మర్యాద లేదని, ఇక రాష్ట్రంలో వీళ్ళు మహిళలకు ఏం గౌరవం ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, సముద్రంలో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్న వైఎస్ షర్మిల అప్పుడప్పుడు చెత్త పైకి వస్తుందని, పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకు లాగే వాళ్ళు కూడా ఉన్నారన్న షర్మిల కొందరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని, పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వైఎస్ షర్మిల హెచ్చరించారు.
Next Story