Wed Mar 18 2026 03:12:53 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు పెద్దగా భక్తుల రద్దీ లేదు.

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు పెద్దగా భక్తుల రద్దీ లేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్్్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్నటి వరకూ భక్తుల రద్దీతో కొనసాగిన తిరుమల కొండ ఈరోజు కొంత తగ్గిందనే చెప్పాలి. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 81,287 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,436 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

