Mon Mar 16 2026 21:48:25 GMT+0530 (India Standard Time)
రద్దీ అలాగే... 24 గంటలు
తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులకు స్వామి వారి దర్శనం ఐదుగంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు దర్శన సమయం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం శ్రీవారిని దర్శించుకోవడానికి పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,700 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,982 మంది భక్తులు తలనీలాలను సమర్పించి శ్రీవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

