Sat Dec 06 2025 12:29:50 GMT+0000 (Coordinated Universal Time)
5,6 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
ఈనెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో కలక్టర్ల సమావేశం జరగనుంది.

ఈనెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో కలక్టర్ల సమావేశం జరగనుంది. మొదటి రోజు కలక్టర్లతోను,రెండవ రోజు కలక్టర్లు,ఎస్పిలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు .5వతేదీ ఉదయం 10గం.ల నుండి 11 గం.ల వరకూ కలక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది.రెండు రోజుల్లోనూ ఉదయం 10గం.ల నుండి సాయత్రం 6గం.ల వరకూ కలక్టర్ల సమావేశం ఉంటుందని స్పెషల్ సిఎస్ సిసోడియా పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు...
జిల్లా కలక్టర్ల సమావేశానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు.ఈసమావేశానికి హాజరయ్యే కలక్టర్లు,ఎస్పిలకు తగిన రవాణా,వసతి వంటి ఏర్పాట్లు చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలక్టర్ సృజనను ఆదేశించారు.అలాగే కలక్టర్ల సమావేశం నిర్వహణకు అవసరమైన వివిధ సహాయ సిబ్బందిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు.
Next Story

