Mon Mar 16 2026 02:42:21 GMT+0530 (India Standard Time)
విశాఖ జగదాంబ థియేటర్ పై దాడులు
విశాఖ జగదాంబ, మెలోడీ థియేటర్ లో జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. టికెట్ ధరలపై ప్రేక్షకులనడు అడిగి తెలుసుకున్నారు.

విశాఖ జగదాంబ, మెలోడీ థియేటర్ లో జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. టికెట్ ధరలపై ప్రేక్షకులనడు అడిగి తెలుసుకున్నారు. జగదాంబలోని త్రీడీ స్క్రీన్ కు టిక్కెట్ల ధరలను ఎక్కువగా విక్రయించారని కలెక్టర్ గుర్తించారు. జిల్లాలో ఉన్న 115 థియేటర్లలో 70 సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. నాలుగు థియేటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఫుడ్ రేట్లను కూడా....
తొలి తప్పిదంగా భావించి నోటీసులు అందజేశామని, మరోసారి రిపీట్ అయితే చర్యలు తప్పవని థియేటర్ల యజమానులకు కలెక్టర్ హెచ్చరించారు. థియేటర్లలో ఫుడ్ రేట్లు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కువ రేట్లకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు. దీంతో థియేటర్ యజమానులు బెంబేలెత్తి పోతున్నారు.
Next Story

