Thu Mar 26 2026 15:33:49 GMT+0530 (India Standard Time)
జగన్ నేడు ఢిల్లీలో రెండో రోజు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చిస్తారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశముంది.
కేంద్ర మంత్రులతో....
జగన్ అమిత్ షాతో సమావేశం ముగించుకున్న తర్వాత మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు. ఆయనతో వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. నిన్న ప్రధాని మోదీతో జగన్ భేటీ అయి దాదాపు గంట సేపు సమావేశమయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కూడా జగన్ కలిశారు.
Next Story

